ఇంట్లోకి దొంగలు రాకుండా తలుపుపై నాగుపామును ఉంచిన కుటుంబం.. వీడియో చూస్తే..

ఇంట్లో దొంగలు పడకుండా, అనవసరమైన విజిటర్స్ ఇంటికి రాకుండా భయపెట్టడానికి పామును( Snake ) నేచురల్ సెక్యూరిటీ సిస్టమ్‌గా ఎవరైనా పెట్టుకుంటారా? అది ఊహించుకోడానికే చాలా భయం కలిగిస్తుంది కదూ.ఒకవేళ నిజంగానే పామును ఎంట్రన్స్ డోర్( Entrance Door ) వద్ద ఉంచితే అది ఎలా ఉంటుందో చూపించే వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Cobra Snake Natural Security System At House Entrance Door Viral Video Details,-TeluguStop.com

@TheFigen_ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు 64 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియో( Viral Video ) ఓపెన్ చేస్తే మనకు తెరిచిన రెండు తలుపు రెక్కలు కనిపిస్తాయి.ఒక తలుపు రెక్క సందులో నుంచి బయటకు వచ్చిన యువ వయసులో ఉన్న నాగుపామును( Cobra ) కూడా మనం గమనించవచ్చు.అది ఆ ఎంట్రన్స్ డోర్ ఎందుకు వచ్చిన ఎవరినైనా కాటు వేయడానికి ప్రయత్నిస్తోంది.

బహుశా ఇది దారి తప్పే ఇంట్లోకి వచ్చి ఆపై ఇలా తలుపు సందులో ప్రత్యక్షమైనట్టుంది.ఈ వీడియో చూసి చాలామంది షాక్ అవుతున్నారు.

తలుపు వెనుక నుంచి వచ్చే రెక్క బలంగా మూస్తే చాలు ఈ పాము పని ఖతం అవుతుందని ఒక నెటిజెన్ అన్నాడు.ఇది 999 యాంటీ థెఫ్ట్ లెవెల్ అనుకుంటా అని మరో యూజర్ ఫన్నీగా కామెంట్ చేశాడు.అయితే నిజజీవితంలో ఎవరూ కూడా ఇలాంటి అత్యంత విషపూరితమైన పాములను ఇంటి ముందు ఉంచుకోరు.ఈ విషయం తెలియని ఎవరైనా పొరపాటున ఎంట్రెన్స్ డోర్ వద్దకు వస్తే పాము వెంటనే కాటేస్తుంది.

అప్పుడు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.అందుకే ఇది చాలా పెద్ద మిస్టేక్ అవుతుందని చెప్పుకోవచ్చు.

వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube