క్యాంపు కార్యాలయంలో కర్నూలుజిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం వైయస్‌.జగన్‌ భేటీ.

కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సీఎం.సమావేశంలో ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడిన సీఎం.

 Cm Ys Jagan Met With Workers Of Kurnool District Alur Constituency In The Camp-TeluguStop.com

వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం వైయస్‌.జగన్‌.

ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉంది నియోజకవర్గంలోని ముఖ్యమైన కార్యకర్తలను కలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం.మనం ఇక మరో 18 –19 నెలల్లో మళ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాం, ఈరోజు నుంచి కూడా ఎన్నికలకు సిద్ధం కావాలి:గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్నాం.ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు, గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్తున్నారు ఈ మూడేళ్లకాలంలో మనంచేసిన మంచి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తున్నాం, ఆ కుటుంబానికి జరిగిన మేలును వివరిస్తున్నాం.ఆ మేలు జరిగిందా? లేదా? అనే విచారణ చేస్తున్నాం.

వారి ఆశీస్సులు తీసుకుంటున్నాం:ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే.వాటిని రిపేరు చేస్తున్నాం ప్రభుత్వంలో ఉన్న మనం అంతా.

గ్రామస్థాయిల్లో కూడా వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం.మనం అంతా కలిసికట్టుగా ఒక్కటి కావాలి.అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తాం:అలాగే ప్రతి సచివాలయానికీ రూ.20లక్షల రూపాయలు అత్యంత ముఖ్యమైన, ప్రాధాన్యతా పనులకోసం కేటాయిస్తున్నాం.గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామంలో 2 రోజులపాటు కచ్చితంగా ఎమ్మెల్యే గడపుతున్నారు, రోజూ 6 గంటలపాటు సమయం గడుపుతున్నారు.

సీఎంగా నేను ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండలేకపోవచ్చు.

సాధ్యంకాదుకూడా.కాకపోతే ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తకూ అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యేలు మాత్రం ప్రతిగ్రామంలో తిరగాలి.గ్రామంలో రెండురోజులపాటు తిరగాలి.రోజుకు 6 గంటలు గడపాలి ప్రజల సాధకబాధకాలు తెలుసుకుని.వాటిని పరిష్కరించే ప్రయత్నం గడపగడపకూ కార్యక్రమం ద్వారా కొనసాగుతుంది.దేవుడి దయవల్ల గడపగడపకూ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి.ఈ మధ్యలో వీలైనప్పుడు నేను ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసంగా 100 మంది కార్యకర్తలను కలుస్తున్నానుఒక్క ఆలూరు నియోజకవర్గానికే వివిధ పథకాల ద్వారా ఈ మూడు ఏళ్ల కాలంలో రూ.1050కోట్లు లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీద్వారా నేరుగా వారి ఖాతాల్లో వేయడం జరిగింది : సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube