హైదరాబాద్ లో ఆకతాయిల ముఠా రెచ్చిపోతుంది.జముండా అఫిషియల్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో ముఠా పేట్రేగిపోతున్నారు.
తమ కమ్యూనిటీ పేరును చెడగొడుతున్నారంటూ తమ వర్గానికి చెందిన యువతులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.దీనిలో భాగంగానే తమ కమ్యూనిటీని డ్యామేజ్ చేస్తున్నారంటూ యువతులకు ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.
అబ్బాయిలతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నట్లు సమాచారం.రోడ్డుపై యువకులతో వెళ్తున్న యువతుల ఫొటోలు తీసేందుకు సుమారు 900 మంది ఉండటం గమనార్హం.
వీరి వేధింపులు తాళలేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో జముండా అఫిషియల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.
సెక్షన్ 506, 509, 354 (డీ) అండ్ ఐటీ యాక్ట్ (64) కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.పేజీ నిర్వాహకుల వివరాలు ఇవ్వాలని ఇన్ స్టాగ్రామ్ కు సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు.







