విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ అత్యున్నత సమీక్షా సమావేశం

తెలంగాణ సచివాలయంలో విద్యుత్ శాఖపై అత్యున్నత సమీక్షా సమావేశం ప్రారంభమైంది.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమీక్ష జరుగుతోంది.

 Cm Revanth's Highest Review Meeting On Power Department-TeluguStop.com

ఈ సమావేశానికి విద్యుత్ శాఖ సీఎండీ ప్రభాకర్ రావు హాజరు కాలేదు.అయితే ఇవాళ్టి సమావేశానికి ప్రభాకర్ రావును రప్పించాలని నిన్న అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

పూర్తి వివరాలతో సమీక్షకు రావాలని తెలిపారు.సీఎం ఆదేశాలు ఉన్నప్పటికీ సీఎండీ ప్రభాకర్ రావు సమావేశానికి గైర్హాజరు అయ్యారు.

కాగా 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు విద్యుత్ శాఖపై జరిగిన కొనుగోళ్లపై పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.అలాగే సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దని ఆదేశించారు.మరోవైపు విద్యుత్ శాఖలో ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube