సోషల్ మీడియాలో వైరల్ అయ్యే యానిమల్ వీడియోస్ ( Animal Videos )మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి.ఈ వీడియోల పుణ్యమా అని జంతువులలో చిలిపి కోణం కూడా ఉందనే సంగతి తెలిసింది.
పెద్ద ఏనుగుల నుంచి చిన్న పక్షుల వరకు అన్నీ కూడా మనుషుల లాగానే ఆడుకోవడానికి ఇష్టపడుతుంటాయి.వాటికి కూడా ఆట బొమ్మలంటే ఇష్టం ఉంటుంది.
ఇప్పటికే ఎన్నో జంతువులు ఆట బొమ్మలతో ఆడుకుంటూ కెమెరాకు చిక్కాయి.ఆ వీడియోలు ఎంతోమందిని ఫిదా చేశాయి.
తాజాగా ఒక ఉడుత బ్లూ బాల్ తో ( Squirrel Blue Ball )ఆడుకుంటూ కనిపించింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో( Social media ) వైరల్ గా మారింది.

నేచర్ ఈజ్ అమేజింగ్ (@AmazingNature) అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 6 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.13 వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక ఇంటి పెరటిలో పడి ఉన్న బంతి పై జంపు చేస్తూ ఉడుత ఆడుకోవడం చూడవచ్చు అది చాలాసేపు బాల్‌పై, దాని బౌన్సీ ఎఫెక్ట్ కు పైకి లేచి పడుతూ ఎంజాయ్ చేసింది.దానిని అటు ఇటు పడేస్తూ బాగా ఆట ఆడుకుంది.
వీడియో 11 సెకండ్లు ఉంది కానీ అంతకంటే ఎక్కువ సేపు ఇది బంతితో కాలక్షేపం చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ ప్రపంచంలో 280కి పైగా జాతుల ఉడుతలు( Squirrels ) ఉన్నాయి.చెట్టు పైనుంచి దూకేటప్పుడు గాల్లో ఎగర గల శక్తి కూడా వీటికి ఉంది.ఉడుతల ముందు దంతాలు అవి చనిపోయేంతవరకు పెరుగుతూనే ఉంటాయి.
ఈ ఉడతలు వేలకొద్దీ గింజలను ఎక్కడ పాతిపెట్టామనే విషయాన్ని కూడా ఈజీగా గుర్తుంచుకోగలవు.చాలా ఎత్తు నుంచి కిందపడినా ఇవి బతకగలవు.
ఎంత పెద్ద ఎత్తునైనా ఇవి ఈజీగా ఎక్కగలవు.ఇంకా ఈ చిన్న జంతువులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.







