తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) రేపు ఆదిలాబాద్ జిల్లాలో రేపు పర్యటించనున్నారు.ఇందులో భాగంగా నాగోబా ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అనంతరం ఆదివాసీలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.సాయంత్రం ఇంద్రవెల్లి( Indervelly )లో జరగనున్న భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.మరోవైపు భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా జనసమీకరణ చేయనున్నారు.