నారాయణపేట కోస్గి( Kosgi ) బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వం కొడంగల్ నీ పట్టించుకోలేదని విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ.బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆరోపించారు.ఒకరు పొత్తంటారు.మరొకరు లేదంటారు.ఆరు గ్యారెంటీలలో( Six Guarantees ) ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు అమలు చేశాం.తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికీ వారం రోజుల్లో ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు.అలాగే వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని రేవంత్ స్పష్టం చేయడం జరిగింది.
వచ్చే నెల 15వ తేదీలోపు ప్రతి రైతుకు డబ్బులు జమ చేస్తామని తెలిపారు.రాబోయే రోజుల్లో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటామని వెల్లడించారు.వచ్చే నెల 15న రైతుబంధు, రైతు భరోసా అమలు చేస్తామని అన్నారు.
రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం సొంత నియోజకవర్గం కొడంగల్ లో( Kodangal ) రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఇదే సభలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చంద్ పోటీ చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.దాదాపు 50 వేల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేయడం జరిగింది.