రేవంత్ కు ఆ అనుమానాలు ..  సచివాలయంలో వాస్తు మార్పులు ?

తెలంగాణ సచివాలయంలో( Telangana Secretariat ) వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

( CM Revanth Reddy ) గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం పూర్తి చేసుకున్న సచివాలయం లో కేసీఆర్( KCR ) సీఎం హోదాలో పూర్తిస్థాయిలో ఆ  సచివాలయంలో విధులు నిర్వహించలేదు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం,  రేవంత్ రెడ్డి సీఎం కావడంతో అప్పటి నుంచి ఆ కొత్త సచివాలయంలోనే రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  రేవంత్ రెడ్డి కోసమే కేసిఆర్ సచివాలయం కట్టించినట్లు అయిందనే సెటైర్లు ఎన్నో వినిపించాయి.

అయితే ఇప్పుడు ఆ సచివాలయంలో వాస్తు మార్పులకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.సచివాలయం నాలుగు వైపులా నాలుగు గేట్లు ఉన్నాయి .ఎదురుగా బాహుబలి గేటు ను ఇప్పుడు మూసి వేస్తున్నారు.  కొత్త గేటు ఏర్పాటు చేస్తున్నారు. 

దీనికోసం దాదాపు మూడు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.  వాస్తవంగా ఆ గేటు నుంచి రాకపోకలు సాగించేందుకు ఎటువంటి ఇబ్బంది లేదు.ప్రస్తుతానికి ఆగేటు నుంచే రేవంత్ రెడ్డి రాకపోకలు సాగిస్తున్నారు .అయితే ఇంతలో ఏమైందో ఏమో గాని ఇప్పుడు ఆ గేటును మూసి వేస్తున్నారు.వాస్తు దోషాలు కారణంగానే ఆ గేటును మూసివేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ గేట్ నుంచి రాకపోకలు సాగించటం వల్ల అనుకోని సమస్యలు వస్తున్నాయని,  వాస్తు పరంగా బాగోలేదని అనుకోవడం వల్లే అక్కడ మార్పు చేర్పులు చేస్తున్నట్లుగా అర్థమవుతోంది.

చిన్న చిన్న పనులు కూడా జాప్యం అవుతుండడం,  రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి వాటిని పరిగణలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి కొంత మంది పండితుల సలహా మేరకు సచివాలయంలో వాస్తు ప్రకారం మార్పు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు పండితుల నుంచి వచ్చిన సలహా మేరకు గేట్లు మార్చాలని డిసైడ్ అయ్యారట.త్వరలోనే దీనికి సంబంధించి పనులు ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం గా ఉన్న కేసీఆర్ కొత్త సెక్రటరీ కట్టాలని అనుకోలేదు.సికింద్రాబాద్ బైసన్ పోల్ గ్రౌండ్ దగ్గర నుంచి చాలా చూశారు.

కానీ అవేవీ నచ్చకపోవడంతో ఇప్పుడు ఉన్న స్థలంలోనే పాత సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయం ను నిర్మించారు.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న రాకింగ్ రాకేష్ కేసీఆర్.. ఇక్కడైనా హిట్టవుతుందా?
Advertisement

తాజా వార్తలు