వీడియో: సింహాన్ని పొడవడానికి దూసుకొచ్చిన ఖడ్గమృగం.. లాస్ట్ ట్విస్ట్ ఊహించరు..

అడవి మృగాల మధ్య చోటు తీసుకునే సన్నివేశాలు సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని తలపిస్తుంటాయి.ఇటీవల అలాంటి ఒక సంఘటన దక్షిణాఫ్రికాలోని సన్‌బోనా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో( Sanbona Wildlife Reserve ) జరిగింది.

 Massive Rhino Stabs At Lion With Its Horn Video Viral Details, Sanbona Wildlife-TeluguStop.com

ఒక భారీ ఖడ్గమృగం( Rhino ), మూడు సింహాల మధ్య జరిగిన పెద్ద పోట్లాట చోటుచేసుకుంది.సాధారణ సఫారీ పర్యటనలో ఉన్న సఫారీ గైడ్ జార్డాన్ డేవిసన్( Jordan Davidson ) ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించారు.

తర్వాత ఈ వీడియోను ఆన్‌లైన్ వైల్డ్ లైఫ్ కమ్యూనిటీ ఛానల్ అయిన లేటెస్ట్ సైటింగ్స్‌తో పంచుకున్నారు.

Telugu Animals Fights, Jordan Davidson, Latest, Prey, Rhino Attack, Rhino, Sanbo

ఈ వీడియో ఓపెన్ చేస్తే మనకు సూర్యరష్మిలో ఎంజాయ్ చేస్తున్న తేలుతున్న మూడు సింహాలు( Three Lions ) కనిపిస్తాయి.వాటిలో రెండు ఆడ, ఒక మగ.వాటి దగ్గరలోనే, ఒక భారీ ఖడ్గమృగం ప్రశాంతంగా గడ్డి మేస్తుంది.కానీ తర్వాత ఖడ్గమృగం సింహాలకు చాలా దగ్గరగా వెళ్ళినప్పుడు పరిస్థితి మారిపోయింది.ఈ భారీ జంతువు సింహాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించి, డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లిపోయింది.

Telugu Animals Fights, Jordan Davidson, Latest, Prey, Rhino Attack, Rhino, Sanbo

ఆడ సింహాలలో ఒకటి ఖడ్గమృగం వెనుక వైపు తిరగడానికి ప్రయత్నించింది.కానీ, ఖడ్గమృగం వెంటనే ప్రతిస్పందించి దాని వైపు తిరిగింది.ఆ భారీ జీవిని ఎదుర్కోవడం ప్రమాదకరం అని గ్రహించిన ఆడ సింహం వెనక్కి వెళ్ళిపోయింది.అనంతరం, మగ సింహం రైనోని నేరుగా ఎదుర్కోవడానికి ప్రయత్నించింది.దీంతో చిర్రెత్తిన ఖడ్గమృగం రెండుసార్లు దూకి, తన పదునైన కొమ్ముతో సింహాన్ని ముందుగా చీల్చడానికి దూసుకెళ్లింది.సింహం ప్రారంభంలో చాలా ధైర్యంగా ఉన్నా, ఆ భారీ మృగం వేగాన్ని బలాన్ని చూసి జడుసుకుంది.

ఈ చిన్న ఫైట్ తరువాత, ఖడ్గమృగం చివరకు దగ్గరలో ఉన్న పొదల్లోకి వెనుకకు వెళ్లిపోయింది.డేవిసన్ ఇది తాను ఇంతకు ముందు చూసిన అత్యంత భీకరమైన ఖడ్గమృగం-సింహం ఫైట్ అని వర్ణించాడు.https://youtu.be/TQE8Ue4KrvI?si=6fKQBpvG-cBRxgAo ఈ లింక్ మీద క్లిక్ చేసి దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube