ఈనెల 29న అనకాపల్లి విచ్చేస్తున్న బిజెపి నేత అనకాపల్లి టీడీపీ జనసేన బిజెపి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ స్వాగత కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు …స్థానిక సన్ క్యాస్టల్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల శాసనసభ అభ్యర్థులతో పాటు మూడు పార్టీల నాయకులతో సమావేశం అయ్యారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29 ఉదయం సీఎం రమేష్ హైదరాబాదు నుండి అనకాపల్లి విచ్చేస్తున్నారన్నారు.విశాఖపట్నం ఎయిర్పోర్టులో ఆయనకు స్వాగతం పలకడం జరుగుతుందన్నారు.
అలాగే పార్టీ శ్రేణులు లంకెలపాలెం నుండి ఆయనకు స్వాగతం పలికి అనకాపల్లి వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు.అనకాపల్లిలో భారీ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.జనసేన టిడిపి బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒక్కొక్క నియోజకవర్గాల నుండి 100 కారులలో ఆయనకు స్వాగతం పలికేందుకు తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అనకాపల్లి టీడీపీ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు బుద్ద నాగ జగదీష్ జిల్లా బిజెపి అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు జిల్లా జనసేన అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు.
పైలా ప్రసాదరావు.కె ఎస్ ఎన్ రాజు.పప్పల చలపతిరావు సుందరపు విజయ్ కుమార్ పెద్ద ఎత్తున టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు