ఏపీలో అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్నామని సీఎం జగన్( CM Jagan ) అన్నారు.నంద్యాల జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో( Memantha Siddam Bus Yatra ) భాగంగా ఆయన ఎర్రగుంట్లలో స్థానికులతో ముఖాముఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎర్రగుంట్లలో 1,496 ఇళ్లు ఉంటే 1,391 ఇళ్లలోని ప్రజలకు లబ్ధి జరిగిందని తెలిపారు.ఈ క్రమంలోనే 93.06 శాతం మందికి లబ్ధి జరిగిందన్నారు.ఒక్క ఎర్రగుంట్లలోనే రూ.48 కోట్ల 74 లక్షలకు పైగా ఖర్చు చేశామని పేర్కొన్నారు.నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నామని తెలిపారు.
58 నెలల కాలంలోనే ఎంతో మేలు చేశామన్న సీఎం జగన్ ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదని చెప్పారు.దిశ యాప్ తో( Disha App ) అక్కాచెల్లెమ్మలకు అండగా నిలిచామన్నారు.స్కూళ్లను అభివృద్ధి చేశామన్న సీఎం జగన్ గ్రామాలకు డాక్టర్లు వస్తున్నారని పేర్కొన్నారు.ఆర్బీకేలతో రైతులను ముందుకు నడిపిస్తున్నామని వెల్లడించారు.పెట్టుబడి సాయం కింద రూ.13,500 ఇస్తున్నామన్నారు.మన భవిష్యత్ కోసం ఓటు వేస్తున్నామన్న జగన్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
ఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలని తెలిపారు.