తెలంగాణలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటినుంచే గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు.
మునుగోడు ఉపఎన్నిక ఫలితాలతో అలర్ట్ అయిన గులాబీ బాస్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు నియోజకవర్గాలపై దృష్టి సారించిన గులాబీ బాస్.
అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.అదేవిధంగా పార్టీ బలాబలాలపై నివేదికలు సిద్ధం చేస్తోంది టీఆర్ఎస్.
ఇందులో భాగంగా నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించారని సమాచారం.వీటిలో కచ్చితంగా విజయం సాధించే స్థానాలు 40 ఉండగా.
కొంచెం కష్టపడితే గెలిచే నియోజకవర్గా స్థానాలు 30 నుంచి 35 వరకు ఉన్నాయి.మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు వీక్ గా ఉన్నట్లు నివేదికలు వచ్చాయి.
దీంతో అప్రమత్తమైన టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఇప్పటి నుంచే ప్రతి నియోజకవర్గంలో చక్రం తిప్పేందుకు ప్లాన్ లు రచిస్తోంది.ఇందుకు పార్టీ నేతలకు, కార్యకర్తలకు అధిష్టానం పలు సూచనలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.