తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ సీఎం కేసీఆర్( CM KCR ).దూసుకుపోతున్నారు.
రెండో దఫా ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.ఇదే సమయంలో ప్రజలకు రకరకాలుగా హామీలు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే సోమవారం నర్సంపేట సభలో వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై( YS Sharmila _ సీఎం కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.సమైక్యవాదులు వారి చెంచాలు నర్సంపేటలో రాజ్యం చేస్తామంటే ఇక్కడి ప్రజలు నిరసనలు తెలిపారు.
అయితే వైయస్ షర్మిల అనే ఆమె ఇక్కడి ఎమ్మెల్యే సుదర్శన్ పై పగ పట్టిందట.
మరి కొద్ది రోజులలో జరగబోయే ఎన్నికలలో సుదర్శన్ నీ ఓడించాలని షర్మిల డబ్బు కట్టలు పంపించబోతుందట.
అయితే షర్మిల డబ్బులు కట్టలు గెలవాలా.? మన మిషన్ భగీరథ మంచినీళ్లు గెలవాలా.? అంటూ ప్రజలనుద్దేశించి కేసీఆర్ సంచలన ప్రశ్నలు వేశారు.ఈ పరాయి రాష్ట్రనికి చెందినవాళ్ళు డబ్బులు సంచులు పంపించి మిమ్మల్ని ఓడిస్తామంటే.
మనం ఓడిపోదామా.? దయచేసి నర్సంపేట ప్రజలు ఆలోచించాలని మనవి చేస్తున్నాను.ఈసారి జరగబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాలతో అధికారంలోకి రాబోతుంది.నర్సంపేట నియోజకవర్గం( Narsampet Assembly constituency )లో అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ సుదర్శన్ రెడ్డినీ గెలిపించాలని ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
గతంలో గెలిపించి మంచి పని చేశారని.నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ గెలిపించాలని సూచించారు.