మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది.ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.
ఈ సభకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు.
ఈ సభలో ఆయన స్పందించే అవకాశాలున్నాయి.







