ఇదేందయ్యా ఇది.. కుక్క వలె సీల్‌ను మచ్చిక చేసిన స్కూబా డైవర్‌..

క్యూట్‌గా కనిపించే సీల్స్ తెలివైన సముద్ర జంతువులు.మానవులతో, ముఖ్యంగా జంతుప్రదర్శనశాలలలోని సంరక్షకులతో గొప్పగా స్నేహం చేస్తుంటాయి.

 Seal Embrasing Scuba Diver Video Viral Details, Seal, Scuba Diver, Viral Video,-TeluguStop.com

భారీ పళ్లుతో సీల్స్ బలంగా, శక్తివంతంగా ఉంటాయి.కానీ అవి ఎవరిపైనా దాడి చేయవు.

కుక్కల వలే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి.నిజానికి ఇవి కుక్కల లాగా తమకు దగ్గరైన మనుషుల నుంచి ప్రేమను, ఆప్యాయతను కోరుకుంటాయి.

కాగా ఇటీవల ఒక సీల్ ఒక స్కూబా డైవర్‌ వద్దకు వచ్చి తనను ప్యాంపర్ చేయాల్సిందిగా అడిగింది.

దాంతో ఆ డైవర్‌ దాని మెడ నిమురుతూ దాన్ని సంతోష పెట్టాడు.

ఈ సమయంలో ఆ సీల్ ఇంకాసేపు నిమురు.ఇంకాసేపు నిమురు అంటూ తన ముందు రెక్కలతో అతడి చేతిని తన మెడకు హత్తుకుంది.

మెల్లిగా ఎలాంటి హాని చేయకుండా అది తన నోటితో అతడి చేతులను కొరికింది.అచ్చం కుక్క లాగానే అది ప్రవర్తించింది.

ఈ అద్భుతమైన వీడియోని నీటి అడుగున చిత్రీకరించారు.వీడియోలో కనిపించే డైవర్ బెన్ బర్విల్లే, వైద్య వైద్యుడు.

నీటి అడుగున ఉన్న కెమెరామెన్ యూకే సముద్ర జీవులను చిత్రీకరించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు.

అతను డాల్ఫిన్లు, సీల్స్ గురించి కూడా పరిశోధన చేస్తున్నాడు.ఈ వీడియోను ట్విటర్‌లో ‘వండర్ ఆఫ్ సైన్స్’ పేజీ షేర్ చేసింది.“సీల్స్ అనేవి సముద్రపు కుక్కలు.” అని దీనికి ఒక క్యాప్షన్ జోడించింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ వీరి ఫ్రెండ్‌షిప్ సూపర్ గా ఉంది అని కామెంట్ చేస్తున్నారు.ఈ క్యూట్ వీడియోకి ఇప్పటికే 22.6 మిలియన్ వ్యూస్, 72 వేల లైక్స్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube