తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల పరంగా రోజురోజుకీ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నీ టార్గెట్ చేస్తూ కేసిఆర్ అవకాశం వచ్చినప్పుడులా తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు.
ఇదిలా ఉంటే నేడు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కేసిఆర్ సమావేశమవుతున్నారు.ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం బీహార్ పర్యటనకు బయలుదేరుతున్నారు.
గాల్వాన్ లోయలో మరణించిన ఐదుగురు బీహార్ సైనికుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున, సికింద్రాబాద్ టింబర్ డిపోలో మరణించిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున అందించనున్నారు.బీహార్ ముఖ్యమంత్రితో కలిసి.
.సీఎం కేసీఆర్ చెక్కులు అందించనున్నారు.
అనంతరం ఇరువురు నేతలు భేటీ అయి జాతీయ రాజకీయాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఎప్పటినుండో కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ భేటీ తర్వాత ఆ కొత్త పార్టీకి సంబంధించి ఏమైనా ప్రకటన వస్తుందేమో అని అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు.







