ఉమ్మడి కర్నూలు జిల్లా( Joint Kurnool Dist )లో సీఎం జగన్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ఈబీసీ నేస్తం పథకం( EBC Nestham Scheme ) నిధులను ఆయన విడుదల చేయనున్నారు.నంద్యాల జిల్లా బనగానపల్లెలో అర్హులైన అక్కాచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.15,000 చొప్పున నగదును సీఎం జగన్ జమ చేయనున్నారు.ఈ క్రమంలో 4,19,853 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.629.37 కోట్లు జమ( Women Bank Accounts ) కానుండగా.
ఓసీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఈ ఆర్థికసాయం అందించనున్నారు.అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు.ఈ మేరకు కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై నేషనల్ లా యూనివర్సిటీకి( National Law University ) సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
తరువాత న్యాయ అధికారులు, న్యాయవాదులతో ముఖాముఖీ నిర్వహించనున్నారు.