ఈనెల 25వ తారీకు మదనపల్లెలో జరగాల్సిన ముఖ్యమంత్రి జగన్ పర్యటన వాయిదా పడినట్లు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.మిధున్ రెడ్డి మరియు మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా మీడియాతో మాట్లాడుతూ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25వ తారీఖున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మదనపల్లెలో పర్యటించాల్సి ఉంది.
కానీ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం పడటంతో పాటు నాలుగు రోజులు పాటు వర్షాలు.కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.
దీంతో భద్రతా కారణాలవల్ల సీఎం పర్యటన వాయిదా పడినట్లు తెలియజేశారు.
తిరిగి ఈనెల 29 లేదా 30వ తారీఖున.
ఉండొచ్చని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాక.షెడ్యూల్ తెలియజేస్తామని ఎంపీ మిధున్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీ చేయనున్నారు.ఇప్పటికే తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
అక్కడ నుండి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని తరువాత నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించి అనంతరం లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు.