TRS ED IT Raids: కొనసాగుతున్న ఈడి ఐటి దాడులు ! టిఆర్ఎస్ నేతల బెంబేలు 

తెలంగాణలో రాజకీయ యుద్ధం రోజు రోజుకు తీవ్రతరం అవుతోంది.ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది, నేతల టెన్షన్ తో పాటు, తమ రాజకీయ ప్రత్యర్థులను ఇరుక్కున పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

 Trs Leaders Tension With Ed It Raids Details, It, Ed, Mallareddy, Enforcement Di-TeluguStop.com

ముఖ్యంగా కేంద్ర అధికార పార్టీ బిజెపి టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండగా, టిఆర్ఎస్ సైతం అంతే స్థాయిలో బిజెపి నేతలను టార్గెట్ చేసుకుంది.ఈ రెండు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా జరుగుతుండగా, ఇదంతా మైండ్ గేమ్ అని బిజెపి టిఆర్ఎస్ లు ఉద్దేశపూర్వకంగానే ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.

వాస్తవం ఏమిటనేది స్పష్టత లేనప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడి, ఐటీ దాడులతో టిఆర్ఎస్ లో కీలక నాయకులుగా గుర్తింపు పొందిన వారు మాత్రం భయాందోళనలు చెందుతున్నారు.ఇప్పటికే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అనేక మంత్రుల ఆస్తులపై ఈడి ఐటి దాడులు జరిగాయి.

ఇంకా వాటి దర్యాప్తు కొనసాగుతుండగా.కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా మద్దపడిన మంత్రి మల్లారెడ్డి పూర్తిగా టార్గెట్ అయ్యారు.

ఈ దాడులతో టీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తుతున్నారు.ఎప్పుడు ఎవరిపై ఈ దాడులు జరుగుతాయనే ఆందోళన చెందుతున్నారు.

చీకోటి ప్రవీణ్ కేసినో కేసుతో మొదలైన ఈ దాడులు ఇప్పటికి కొనసాగుతున్నాయి.టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని కేంద్రం ఈ స్థాయిలో టార్గెట్ చేసుకోవడంతో కేసీఆర్ సైతం అప్రమత్తమయ్యారు.

Telugu Amith Sha, Ed, Directaret, Malla, Telangana, Telngana Cm Kcr, Trs-Politic

ఈడి, ఐటి దాడులు విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ కీలక నాయకులు అందరికీ ఆయన ఆదేశాలు జారీ చేశారు.అసలు ఈ వ్యవహారంపై నిన్ననే పార్టీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని చూసినా అది జరగలేదు.ఈటి,ఐడి దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ కేసిఆర్ పిలుపునిచ్చినా, ఈడి, ఐటి దాడుల్లో దొరికితే ఆ నష్టం పూడ్చుకోలేనిదనే భావంతో చాలామంది నాయకులు ఉన్నారు.టిఆర్ఎస్ లో ఈటి, ఐడి దాడులపై ఆందోళన కలుగుతున్న,  పైకి మాత్రం బిజెపి తమను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినా, వెనక్కి తగ్గేదే లేదని ఆ పార్టీపై రాజీ లేకుండా పోరాడుతామంటూ కేసీఆర్ ధైర్యంగా చెబుతూ పార్టీ నాయకులను ధైర్యాన్ని నూరుకోస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube