సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పనులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.గృహా నిర్మాణ శాఖపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగే విధంగా కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ తెలిపారు.ఇల్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇల్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.







