ఏపీ లో నామినేటెడ్ పదవుల భర్తీ ! ఆ పేర్లు ఇవే ?

2019లో అఖండ మెజారిటీతో వైసిపి అధికారంలోకి వచ్చింది.ఎన్నికలకు ముందే వైసీపీ తరఫున పోటీ చేసేందుకు ఎంతోమంది పోటీపడ్డారు.

మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు తమకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.అయితే జగన్ మాత్రం కొన్ని కొన్ని సమీకరణాల నేపథ్యంలో కొత్తవారికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారు.

ఇంకా అనేక మందికి నామినేటెడ్ పదవులను ఇస్తామంటూ హామీ ఇచ్చారు.అయితే ఆ హామీ మేరకు అనేక దఫాలుగా ఏపీ లో పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను భర్తీ చేసినా,  కొంతమంది నేతలు అసంతృప్తి గానే ఉన్నారు.

  తాజాగా మరోసారి పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.  ఈ మేరకు దాదాపు 60 నుంచి 70 వరకు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ల ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

అలాగే 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన వారు, అనేక కారణాలతో టికెట్ దక్కించుకోలేని వారికి ఈ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు సమాచారం.రేపు దాదాపు 60 నుంచి 70 వరకు కార్పొరేషన్ చైర్మన్ లను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  విఎంఆర్ చైర్మన్ గా అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర విద్యా విభాగం వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, నెడ్ క్యాప్ చైర్మన్ గా కే కే రాజు పేర్లు ప్రతి పాదనలో ఉన్నట్లు సమాచారం.

అలాగే రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ గా దాడి రత్నాకర్, విశాఖ రీజియన్ పెట్రో కారిడర్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జీవి, అలాగే రాష్ట్ర బ్రాహ్మణ విభాగం చైర్మన్ గా సుధాకర్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా గుంటూరు జిల్లా కు చెందిన ఓ నేత కు అవకాశం దక్కబోతున్నట్లుగా కొన్ని పేర్లు బయటకు వచ్చాయి.  అయితే ఈ పేర్లు లో మార్పులు చేర్పులు ఉంటాయని,  వీటితో పాటు, అన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులలో విధేయత కు ప్రాధాన్యం ఇచ్చే విధంగా లిస్ట్ తయారు చేసినట్లు తెలుస్తోంది.పదవులకు సంబంధించి జగన్ పై  మంత్రుల ద్వారా అనేక మంది ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ రోజు రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు