CM Jagan Vijayawada : విజయవాడ, నెల్లూరులో పర్యటించనున్న సీఎం జగన్..!!

CM Jagan To Visit Vijayawada And Nellore , CM Jagan, Vijayawada, Nellore

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం నేడు కడప జిల్లాలో పర్యటించాలి.కడప పెద్ద దర్గా ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం నేపథ్యంలో దర్గాని సందర్శించడానికి సీఎం జగన్ రెడీ కాగా… వాతావరణం అనుకూలించకపోవడంతో కడప పర్యటన రద్దు అయింది.

 Cm Jagan To Visit Vijayawada And Nellore , Cm Jagan, Vijayawada, Nellore-TeluguStop.com

ఇదిలా ఉంటే రేపు విజయవాడ మరియు నెల్లూరులో సీఎం జగన్ పర్యటించనున్నారు.ముందుగా విజయవాడ మున్సిపల్ స్టేడియంలో “జయహో బీసీ” సభలో పాల్గొననున్నారు.

ఉదయం 11:50 గంటలకు సీఎం జగన్ ఈ సభకు హాజరుకానున్నారు.

మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ సభలో పాల్గొంటారు.

అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు నెల్లూరుకు బయలుదేరనున్నారు.మధ్యాహ్నం మూడు 3:25 గంటలకు నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడు చేరుకుంటారు.సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కుమార్తె వివాహ రిసెప్షన్ లో పాల్గొంటారు.ఆ తర్వాత రేపు సాయంత్రం 6:20 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకొనున్నారు.సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube