విజయవాడ, నెల్లూరులో పర్యటించనున్న సీఎం జగన్..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం నేడు కడప జిల్లాలో పర్యటించాలి.
కడప పెద్ద దర్గా ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం నేపథ్యంలో దర్గాని సందర్శించడానికి సీఎం జగన్ రెడీ కాగా.
వాతావరణం అనుకూలించకపోవడంతో కడప పర్యటన రద్దు అయింది.ఇదిలా ఉంటే రేపు విజయవాడ మరియు నెల్లూరులో సీఎం జగన్ పర్యటించనున్నారు.
ముందుగా విజయవాడ మున్సిపల్ స్టేడియంలో "జయహో బీసీ" సభలో పాల్గొననున్నారు.ఉదయం 11:50 గంటలకు సీఎం జగన్ ఈ సభకు హాజరుకానున్నారు.
మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ సభలో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు నెల్లూరుకు బయలుదేరనున్నారు.
మధ్యాహ్నం మూడు 3:25 గంటలకు నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడు చేరుకుంటారు.సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కుమార్తె వివాహ రిసెప్షన్ లో పాల్గొంటారు.
ఆ తర్వాత రేపు సాయంత్రం 6:20 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకొనున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది.
బంగాళదుంప తింటే బరువు పెరుగుతారా..?