ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan ) కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.జులై 8 వైయస్ జయంతి సందర్భంగా అప్పటినుండి పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఆదివారం నాడు సొంత నియోజకవర్గం పులివెందులలో ₹26.12 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆర్చరీ బ్లాక్ కు వెళ్లిన సీఎం జగన్ సరదాగా.
బౌ సాయంతో గురిపెట్టిన జగన్ మిస్ కాకుండా టార్గెట్ ను రీచ్ అయ్యారు.ఆ తర్వాత హాకీ స్టిక్ సాయంతో ఓ గోల్ కొట్టడం జరిగింది.
ఈ క్రమంలో స్పోర్ట్స్ అకాడమీలో ( Sports Academy )జగన్ పర్యటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదే పర్యటనలో గరుండల రివర్ ఫ్రంట్, ఇస్టా స్కిల్ డెవలప్మెంట్( Riverfront, Ista Skill Development ) సెంటర్లను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించడం జరిగింది.వీటితోపాటు బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, హ్యాండ్ బాల్, ఖో ఖో, ఇండోర్ బ్యాట్ మింటన్ కూడా ప్రారంభించడం జరిగింది.అదేవిధంగా పులివెందులలో వైయస్సార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ప్రారంభించారు.
ఈ పర్యటనలో సీఎం జగన్ తో పాటు మంత్రి అంజాద్ భాష, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు.పార్టీకి చెందిన ఇతర నాయకులు హాజరు కావడం జరిగింది.