వైసీపీ అధినేత సీఎం జగన్( CM ys jagan ) 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన తర్వాత ఎక్కువగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి జగన్ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది.
ఈ క్రమంలో వైయస్సార్ వాహన మిత్ర అంటూ అప్పట్లో ఆటో డ్రైవర్లకు హామీలు ఇవ్వడం జరిగింది.ఈ క్రమంలో తాజాగా ఐదో విడత “వైయస్సార్ వాహన మిత్ర( YSR Vahana Mitra )” నగదు బదిలీ నేపథ్యంలో సీఎం జగన్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.
“బ్రతుకు బండి లాగేందుకు ఇబ్బందిపడుతూ ఆటో, టాక్సీలను నడుపుకుంటున్న అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను ఆదుకునేందుకు మన ప్రభుత్వంలో వైయస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టాం.స్వంతంగా ఆటో, టాక్సీలను నడుపుకుంటున్న వారు వివిధ సర్టిఫికెట్లు పొందడంలో అండగా నిలిచే ఉద్దేశంతో ఈ పథకం ద్వారా వారికి ఏటా రూ.10 వేలు అందజేస్తున్నాం.దేవుడి దయతో నేడు వరుసగా ఐదో ఏడాది 2,75,931 మంది డ్రైవర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.276 కోట్లను జమచేశాం.ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1,300 కోట్లను మన ప్రభుత్వం అందజేసింది” అని ముఖ్యమంత్రి జగన్ సోషల్ మీడియా( Social media )లో పోస్ట్ చేయడం జరిగింది.







