రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ( YCP ) మళ్లీ గెలుస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు ఆ పార్టీ అధినేత , ఏపీ సీఎం జగన్. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను అధికారంలో కూర్చోబెడతాయి అనే నమ్మకంతో ఉన్నారు.
అంతే కాదు వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 గెలుచుకుని తన సత్తా చాటుకోవాలని జగన్( Jagan ) టార్గెట్ పెట్టుకున్నారు.అంతే కాదు పార్టీ శ్రేణులకు ఇదే టార్గెట్ విధించారు.
ఇక తన రాజకీయ ప్రత్యర్ధులైన టీడీపీ, బీజేపీ, జన సేన, కాంగ్రెస్, వామపక్షాలు, ఇలా అంతా కలికట్టుగా వచ్చినా, తాము ఒంటరిగానే పోటీ చేస్తామని జగన్ సవాల్ విసురుతున్నారు.మరోవైపు చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా వైసీపీని ఓడించి అధికారంలోకి రావాలనే పట్టుదలతో అటు టిడిపి, జనసేన, బిజెపిలో ఉన్నాయి.
ప్రస్తుతం బిజెపి, జనసేన పార్టీలు పొత్తులో ఉన్నా, బిజెపితో తెగ తెంపులు చేసుకొని టిడిపి తో పొత్తు పెట్టుకునేందుకు పవన్ సిద్ధంగానే ఉన్నారు.రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అన్న ధీమా పవన్ లో కనిపిస్తుంది.
అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) కూడా జనసేనతో పాటు బిజెపిని కలుపుకు వెళ్తే తిరిగి ఉండదని, ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే పరాభవమే మూడు పార్టీలకు తప్పదనే లెక్కలు వేస్తున్నారు.ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా వైసిపిని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని, వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూడాల్సిన అవసరం ఉందంటూ చెబుతున్నారు.

ఇటీవల జనసేన పదవ ఆవిర్భావ సభ మచిలీపట్నంలో జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి బలి పశువును కాను అంటూ మాట్లాడారు.దీంతో వైసీపీని ఎదుర్కొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ తో కలిసి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది.ఈ నేపథ్యంలోనే జగన్ ప్రత్యర్ధుల ఎత్తులకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ద్వారానే వ్యక్తి సమాధానం చెప్పాలని , వాటి ద్వారానే ప్రత్యర్ధులను చిత్తుగా ఓడించాలని నిర్ణయించుకున్నారు.
దీనిలో భాగంగానే వచ్చే ఏడాది జనవరి నుంచి వృద్ధాప్య పెన్షన్లను 3000కు పెంచాలని జగన్ నిర్ణయించుకున్నారు.

దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ పెన్షన్ ఇవ్వడం లేదని, అలాగే ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం ఏదీ లేదని, అన్ని రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్ గా మారిందని దీంతో పాటు ప్రజల్లోనూ ఈ సంక్షేమ పథకాలపై పూర్తిగా సంతృప్తి ఉందని ఇవే తమను ఎన్నికల్లో గెలిపిస్తాయని నమ్మకంతో జగన్ ఉన్నారు.రాబోయే ఎన్నికల్లో తమ రాజకీయ ప్రత్యర్థులంతా మూకుమ్మడిగా తమపై పోటీకి వచ్చినా ఎదుర్కొనే విధంగా ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, మరిన్ని ప్రజాకర్షణ పథకాలను ప్రవేశపెట్టి సక్సెస్ అవ్వాలని వ్యూహంలో జగన్ ఉన్నారట.







