వైసీపీలో గందరగోళం ! విజయసాయిపైనే జగన్ నమ్మకం ?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ( YCP ) పరిస్థితులు చేజారిపోతున్నాయి.ఎక్కడలేని అసంతృప్తులు బయటపడుతున్నాయి.

 Cm Jagan Mohan Reddy Hopes On Ycp Mp Vijayasai Reddy Details, Vijayasaireddy, Sa-TeluguStop.com

పార్టీకి అత్యంత కీలకమైన వ్యక్తులు, జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు ఇప్పుడు శత్రువులుగా మారిపోతున్నారు.అనేకమంది పార్టీకి దూరం కాగా, మరి ఎంతోమంది దూరంగా ఉన్నారు.

తమ బాధలు, ఇబ్బందులను అధినేత జగన్ కు( CM Jagan ) చెప్పుకునేందుకు అందరికీ అవకాశం దొరకపోవడం, ఏ విషయాన్ని అయినా, పార్టీ తరపున ప్రభుత్వ సలహాదారు, పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) చక్కబెడుతూనే వస్తున్నారు.జగన్ సైతం పూర్తిగా సజ్జలపైనే నమ్మకం పెట్టుకోవడంతో అన్ని బాధ్యతలను ఆయనకే అప్పగించారు.

అయితే సజ్జల దూకుడు నిర్ణయాలతో పార్టీకి ఇబ్బందులు వస్తుండడం, ఆయన అన్ని వ్యవహారాలను చక్కబెట్టడంలో సక్సెస్ కాలేకపోవడం వంటివన్నీ  లెక్కలు వేసుకుంటున్న అధినేత జగన్ మళ్లీ పార్టీ కీలక బాధ్యతలు అన్నిటిని విజయసాయి రెడ్డికి( Vijayasai Reddy ) అప్పగించాలని నిర్ణయించుకున్నారట.

Telugu Ap, Jagan, Rajinikanth, Tamila, Vijayasai, Ysrcp-Politics

మొదట్లో వైసిపి కి సంబంధించి అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి చక్కబెట్టేవారు ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వారికి ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం లేకుండా చేసేవారు.అయితే విజయ్ సాయి కి అకస్మాత్తుగా జగన్ ప్రాధాన్యం తగ్గించడం, ఉత్తరాంధ్ర ఇన్చార్జి బాధ్యతలు నుంచి తప్పించడం, సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వంటి వ్యవహారాలతో విజయసాయి సైలెంట్ అయిపోయారు.ఇదే సమయంలో నందమూరి తారకరత్న మృతి చెందిన సందర్భంలో టిడిపి అధినేత చంద్రబాబు , బాలకృష్ణ లతో విజయ సాయి సన్నిహితంగా మెలిగారు.

అప్పటి నుంచి ప్రతిపక్షాలపై విమర్శలను తగ్గించారు.

Telugu Ap, Jagan, Rajinikanth, Tamila, Vijayasai, Ysrcp-Politics

సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు.ఉన్నా.సాధారణ పోస్టులకే పరిమితం అవుతున్నారు.

ఇక పార్టీ బాధ్యతలు అన్నిటినీ చక్కబెడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని కొన్ని విషయాల్లో తప్పటడుగులు వేస్తున్నారు.కొన్ని కొన్ని సందర్భాల్లో అది వైసిపికి ఇబ్బందికరంగా మారడం వంటివి ఇటీవల కాలంలో చోటు చేసుకున్నాయి.

ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో వైసిపి నాయకులు చేసిన విమర్శలు పార్టీకి చాలా డ్యామేజ్ ని కలిగించాయి.రజినిపై చేసిన విమర్శలు కారణంగా వైసిపికి జరిగిన డ్యామేజ్ పై జగన్ కూడా అనవసరంగా ఈ వ్యవహారంలో స్పందించి తప్పు చేశాను అనే భావంతో ఉన్నారట.

వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బహిరంగంగా విమర్శలకు దిగడం, వారిని బుజ్జగించి పరిస్థితులను చక్కదిద్దే విషయంలో సజ్జల సక్సెస్ కాలేకపోవడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న జగన్ మళ్ళీ విజయసాయికి కీలక బాధ్యతలు అప్పగించి పార్టీని గాడిలో పెట్టాలనే ఆలోచనతో ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube