అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించే బాధ్యత సీఎం జగన్ లేదా అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.తూర్పు గోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలో పర్యటించిన ఆయన రోడ్డు వెంట ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్ పై మండిపడ్డారు.రైతులు కష్టాల్లో ఉంటే జగన్ ఎక్కడ ఉన్నారన్న చంద్రబాబు సీఎంకి రైతులను పరామర్శించే బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
వైసీపీ నేతలు, మిల్లర్లు కలిసి రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.మిల్లర్లు ఎందుకు డబ్బులు కట్టించుకుంటున్నారో చెప్పాలన్నారు.72 గంటల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోకపోతే పారబోయొద్దన్న చంద్రబాబు మనమే సీఎం జగన్ నివాసానికి ధాన్యాన్ని తీసుకెళ్దామని తెలిపారు.కేసులు పెడతారని రైతులు భయపడొద్దని సూచించారు.







