ఉగ్రం, రామబాణం డే 1 వసూళ్లు.. ఎవరిది పైచేయి అంటే?

ఈ వారం కూడా థియేటర్స్ లోకి రెండు సినిమాలు వచ్చాయి.మంచి బజ్ తోనే రిలీజ్ అయిన సినిమాల్లో గోపీచంద్ రామబాణం, అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలు ఉన్నాయి.

 Allari Naresh Ugram And Gopichand Rama Banam Box Office Collections , Allari Na-TeluguStop.com

ఈ రెండు సినిమాలు మంచి ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.మ్యాచో స్టార్ గోపీచంద్( Gopichand ) హీరోగా డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రామబాణం( Rambanam ).ఈ సినిమా మే 5న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ వంటి వారు కీలక పాత్రల్లో నటించగా.

మిక్కీ జే మేయర్( Mickey Jay Mayer ) సంగీతం అందించాడు.అలాగే డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది.ఇక అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఉగ్రం.

విజయ్ కనకమేడల ( Vijay Kanakamedala ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో మిర్నా హీరోయిన్ గా నటించింది.నరేష్ ఈ సినిమాలో తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.ఈ సినిమా కూడా నిన్ననే గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యింది.

మరి ఈ ఇద్దరి హీరోల సినిమాలు మొదటి రోజు ఎంతమేర కలెక్షన్స్ సాధించాయో చూద్దాం.ఉగ్రం సినిమా 5.80 కోట్ల బిజినెస్ చేయగా.

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 61 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా 73 లక్షల షేర్, 1.45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు టాక్.ఇక రామబాణం రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.27 కోట్ల షేర్ రాబట్ట గా 2.20 గ్రాస్ రాబట్టినట్టు సమాచారం.ఈ సినిమా మొత్తంగా 15 కోట్లకు పైగా నే బిజినెస్ చేయగా మొత్తంగా 13 కోట్లను రాబడితేనే ఈ సినిమా హిట్ అయినట్టు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube