టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ అఖండ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.టికెట్ రేట్లు పెరిగిన తర్వాత అఖండ సినిమా విడుదలై ఉంటే ఈ సినిమా కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండేవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
తక్కువ టికెట్ రేట్లతోనే బాక్సాఫీస్ వద్ద బాలయ్య సంచలనాలు సృష్టించాడని బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు బాలయ్య హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.
హిందూపురం ప్రజల అభివృద్ధి కోసం బాలకృష్ణ తన సొంత డబ్బును కూడా ఖర్చు చేస్తుండటం గమనార్హం.హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే.గత 40 సంవత్సరాలలో హిందూపురంలో తెలుగుదేశం పార్టీ తప్ప మరో పార్టీ గెలవలేదు.2019 ఎన్నికల్లో రాయలసీమలో జగన్ కు అనుకూల ఫలితాలు వచ్చినా హిందూపురం నియోజకవర్గంలో మాత్రం టీడీపీనే అధికారంలోకి వచ్చింది.
అయితే 2024 ఎన్నికల్లో హిందూపురంలో వైసీపీ గెలిచేలా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా.హిందూపురంలో పార్టీని పటిష్టపరచటంపై జగన్ దృష్టి పెట్టారని వైసీపీ నేతల మధ్య విభేదాలు రాకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.2024 ఎన్నికల్లో హిందూపురంలో కచ్చితంగా వైసీపీ గెలిచేలా ప్రణాళికలను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది.
2024 ఎన్నికల్లో సీఎం జగన్ బాలయ్యకు భారీ షాకివ్వడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంపై ఇప్పటికే సీఎం జగన్ దృష్టి పెట్టారనే సంగతి తెలిసిందే.సీఎం జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా 2024 ఎన్నికల్లో వైసీపీనే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేల ఫలితాల ద్వారా వెల్లడవుతోంది.
మరోవైపు బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో బాలయ్య నటిస్తున్నారు.