రాష్ట్రాన్ని చల్లగా చూడమని అల్లాను కోరండి

రంజాన్‌ మాసం ఆరంభం అయ్యింది.ప్రతి ఏడాది ఈ సమయంలో ముస్లీంలు అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించుకుంటూ ఉంటారు.

ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైన రోజులుగా వారు భావిస్తూ ఉంటారు.ఉపవాసాలు చేస్తూ హలీమ్‌ తిని సాయంత్రం సమయంలో ఉపవాస దీక్షను వదిలేస్తూ ఉంటారు.

ప్రతి రోజు ఉపవాసాలు చేస్తూ మసీదుకు వెళ్లి నవాజు చేస్తూ ఉండే ముస్లీంలు ఈసారి మాత్రం పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది.లాక్‌డౌన్‌ మే 3న సడలించినా కూడా ముస్లీంలు మరియు ఇతర మతాల వారు దైవ ఆరాధనకు మందిరాలకు వెళ్లకూడదని కేంద్రం నుండి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ముస్లీంలకు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశాడు.ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే నవాజు చేసుకుంటూ ఉపవాస దీక్షలు చేసుకోవాలన్నాడు.

Advertisement

అలాగే రాష్ట్రం బాగుండాలని అల్లాను వేడుకోవాలంటూ ముస్లీంలకు సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశాడు..

దారుణం: ఐసీ క్రీం ఇప్పిస్తామంటూ లైంగిక దాడి!
Advertisement

తాజా వార్తలు