ఏపీ రాజధాని అంశం గత కొంతకాలంగా వైసిపి ప్రభుత్వం రాజధాని అమరావతి తో పాటు , విశాఖ ,కర్నూలు ను రాజధానిగా జగన్ ప్రకటించడంతో పాటు, అక్కడ తన నిర్ణయం మేరకు పరిపాలన రాజధానిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, జగన్ 2024 ఎన్నికల కంటే ముందుగానే తన నిర్ణయాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.
అయితే అమరావతి పరిసర ప్రాంత ప్రజలు రైతులను రెచ్చగొడుతూ.టిడిపి అమరావతి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తుండడం, రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండడంతో జగన్ ఈ విషయంపై పూర్తిగా దృష్టిపెట్టారు.
ఇక 2024 ఎన్నికల్లో అమరావతి ప్రాంతం ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించుకోవడం ద్వారా, ఈ ప్రాంత ప్రజల్లో వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఎటువంటి వ్యతిరేకత లేదని మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు అమరావతి పరిసర ప్రాంత ప్రజలు అంగీకారం తెలిపినట్లు అవుతుందని జగన్ భావిస్తున్నారు.అందుకే తాడికొండ, మంగళగిరి నియోజకవర్గం ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు, ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీలోని కీలక నాయకులకు బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసిపికి చెందిన ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.అయితే ఆమె వ్యవహారంపై సొంత పార్టీలోనే అసంతృప్తి ఉండడంతో టిడిపి నుంచి వైసీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ కు ఇంచార్జీ బాధ్యతలను జగన్ అప్పగించారు.

ఇక్కడ పూర్తిగా వైసిపికి సానుకూలత పెంచే విషయంపైనే మాణిక్యవరప్రసాద్ దృష్టిపెట్టి పనిచేసే విధంగా చేశారు.ఇక మంగళగిరి నుంచి టిడిపి తరఫున నారా లోకేష్ పోటీ చేయబోతున్నారు.వైసిపి అభ్యర్థిని మళ్లీ గెలిపించే విధంగా జగన్ అనేక వ్యవహారాలను రూపొందిస్తున్నారు.ఇప్పటికే ఇక్కడి నుంచి రెండు సార్లు వరుసగా వైసిపి తరుపున గెలుపొందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నారు.
అయితే రాబోయే ఎన్నికల్లో ఆళ్లకు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారు.మంగళగిరిలో వైసిపి అభ్యర్థిగా టిడిపి నుంచి వచ్చిన గంజి చిరంజీవికి టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఏది ఏమైనా మంగళగిరి, తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ జెండా మళ్లీ ఎగురవేసి అమరావతి సెంటిమెంట్ లేదనే విషయాన్ని మరోసారి రుజువు చేయాలని లక్ష్యంతో జగన్ ఉన్నారట.







