తెలంగాణ అసెంబ్లీలో రేపు సాయంత్రం సీఎల్పీ కీలక సమావేశం( CLP Meeting ) జరగనుంది.ఈ నెల 12వ తేదీన ఇరిగేషన్ పై( Irrigation ) శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇరిగేషన్ పై చర్చలో అనుసరించాల్సిన వ్యూహాంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దిశానిర్దేశం చేయనుంది.అయితే ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్యేలను కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project ) సందర్శనకు తీసుకెళ్లాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు శాసనసభలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలతో పాటు శాసనమండలిలో ఉన్న 40 మంది సభ్యులు ప్రాజెక్టు సందర్శనకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు.ఈ క్రమంలోనే 13వ తేదీ ఉదయం 10 గంటలకు శాసనసభ నుంచి ప్రాజెక్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.