స్వల్ప అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..!!

పీపుల్స్ మార్చ్ పేరిట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

గత 60 రోజులకు పైగా సాగుతున్న ఈ పాదయాత్రలో గురువారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం రుక్కంపల్లి వద్ద బట్టి విక్రమార్క షుగర్ లెవెల్స్ తగ్గటంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

దీంతో హుటాహుటిన పార్టీ కార్యకర్తలు నాయకులు వైద్య శిబిరం వద్దకు తరలించి వైద్యుని చేత ఆరోగ్యాన్ని పరీక్షించారు.షుగర్ లెవెల్స్ తగ్గాయని ఎండలకు వందల కిలోమీటర్లు దూరం నడవడం వల్ల.

ఫ్లూయిడ్స్ బాగా తగ్గాయని తెలియజేయడం జరిగింది.

తీవ్రమైన ఎండలకు వందల కిలోమీటర్లు నడవడం వల్ల వడదెబ్బ ఇంకా డిహైడ్రేడేషన్ ( Dehydration )కారణంగా బట్టి విక్రమార్క అస్వస్థకు గురయ్యారాన్ని వైద్యులు తెలియజేశారు.దీంతో 48 గంటలు విశ్రాంతి తీసుకోవాలని.సూచించారు.

Advertisement

పూర్తిగా అబ్జర్వేషన్ అవసరమని కూడా పేర్కొన్నారు.దీంతో డాక్టర్లు సూచనలు మేరకు "పీపుల్స్ మార్చ్"( Peoples March ) పాదయాత్ర.

మే 19, 20 తేదీలలో విరామం ప్రకటించడం జరిగింది.భట్టి విక్రమార్క అనారోగ్యానికి గురికావడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు విషయం తెలుసుకొని ఆయన శిబిరం వద్దకు చేరుకుని.

పరామర్శిస్తున్నారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు