తెలంగాణలో శాసనమండలి సభ్యుల ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఇవాళ్టితో ముగిసింది.
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు ముగిశాయి.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి.ఈ బరిలో ఎంఐఎం అభ్యర్థితో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి ఉన్నారని తెలుస్తోంది.
కాగా రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు.నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 27 వరకు సమయం ఉంది.
అదేవిధంగా మార్చి 13న పోలింగ్ నిర్వహించనుండగా… 16న ఓట్ల లెక్కింపు జరగనుంది.







