సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా వచ్చిన గౌతమ్ నంద సినిమా బాక్సఫీస్ వద్ద ప్లాప్ అయిందనే చెప్పాలి ఈ సినిమా లో ద్విపాత్రాభినయం చేసిన గోపీచంద్ రెండు పాత్రల్లోనూ అద్భుతంగా నటించాడని చెప్పాలి.ఈ సినిమా కి సంపత్ నంది డైరెక్షన్ కూడా చాల ప్లస్ అయిందనే చెప్పాలి.అయితే ఈ సినిమా ఎందుకు ప్రేక్షకులని అలరించలేకపోయింది అంటే ఈ సినిమా స్టోరీ ఇప్పటి వరకు చాలా తెలుగు సినిమాల్లో వచ్చిన స్టోరీ నే కావడం,మరి ముఖ్యంగా ఎస్ వి కృష్ణ రెడ్డి నటించి, డైరెక్షన్ చేసిన అభిషేకం సినిమాను పోలి ఉందని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి అయితే అభిషేకం సినిమాలో ఎస్ వి కృష్ణా రెడ్డి కూడా ద్విపాత్రాభినయం చేసారు ఆ సినిమాలో ఒకరు ధనవంతుడు, ఒకరు పేదవాడు అయినా వాళ్లిద్దరూ ఒకరి ప్లేస్ లోకి ఇంకొకరు వస్తారు సేమ్ ఈ సినిమాలో కూడా అదే స్టోరీ ఉంటుంది…
అయితే ఈ సినిమాలో స్టోరీ చాలా పాత గా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే కొంచం కొత్తగానే రాసుకున్నారు అయినప్పటికీ సినిమా ప్రీ క్లైమాక్స్ లో సినిమా కొంచం స్లో గా సాగుతుంది దాంతో జనాలకి ఒక టైం లో ఈ సినిమా మీద విసుగు వస్తుంది.ఆలా ఈ సినిమా థియేటర్ లో కూర్చున్న జనాలని ఎంగేజ్ చేయడం లో కొంత వరకు ఫెయిల్ అయినదనే చెప్పాలి…
ఈ సినిమా తర్వాత గోపీచంద్, సంపత్ నంది కాంబో లో సీటిమార్ అనే మరో సినిమా కూడా వచ్చింది.ఈ సినిమా బాక్సఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.వీళ్లిద్దరి మధ్య మంచి ర్యాపొ ఉండడం వల్ల గౌతమ్ నంద ప్లాప్ అయినా వీళ్ల కాంబోలో తక్కువ టైంలోనే ఇంకో సినిమా వచ్చింది…