నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులతో పాటు మాస్ ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు.
అయితే ఈసారి బాలయ్య దెబ్బ గట్టిగానే కొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.అందుకే అఖండ చిత్రం కోసం ఎలాంటి విషయంలో కాంప్రమైజ్ కాలేదని చిత్ర యూనిట్ అంటోంది.
ముఖ్యంగా అఘోరా లాంటి లుక్‌లో కనిపించేందుకు కూడా ఆయన ఓకే అన్నారట.దీన్ని బట్టి బాలయ్య ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇక బాలయ్య సినిమా అంటేనే మాస్ యాక్షన్‌కు కేరాఫ్ అడ్రెస్ అని చెప్పాలి.బాలయ్య డైలాగులతో పాటు చేసే యాక్షన్ సీన్స్‌ను చూసేందుకే చాలా మంది థియేటర్లకు వెళ్తారనడంలో అతిశయోక్తి లేదు.
కాగా బాలయ్య ఫ్యాన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఈసారి బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే యాక్షన్ సీక్వెన్స్‌లను రెడీ చేస్తున్నాడట.ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ ఈ సినిమా మొత్తాన్ని మరిచిపోయేలా చేస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.
ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు కూడా చేశారట చిత్ర యూనిట్.
ఎమెషన్‌తో పాటు బాలయ్య బాబు డైలాగులు, దానికి తగ్గట్టుగా గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్ కలగలిసి అఖండ చిత్రానికి అఖండమైన విజయాన్ని కట్టిబెట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
కాగా క్లైమాక్స్‌లో బాలయ్య చెప్పబోయే డైలాగులు కేవలం ఆయన మాత్రమే చెప్పగలిగేలా ఉంటాయని చిత్ర యూనిట్ ప్రచారం చేస్తోంది.అఖండ చిత్రాంలో అన్నింటిని మించి ఉండే క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ సినిమాను వెండితెరపై చూసి తీరాల్సిందే.