దారుణంగా త‌గ్గిన యాపిల్ దిగుబ‌డి.. కార‌ణ‌మిదే!

కాశ్మీర్‌ను హార్టికల్చర్ స్టేట్ అంటారు.వ్యవసాయం, ఉద్యానవనాలు ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయని, అయితే ఈసారి వాతావరణం కారణంగా ఇక్కడి తోటల పెంపకందారులు తీవ్రంగా నష్టపోయారు.

 Climate Change In Kashmir Apple Farmers Reeling Under Extreme Weather, Falling Yield,apple, Apple Farming,apple Farmers, Kashmir,kashmir Apple,weather-TeluguStop.com

మార్చి నుంచి ఏప్రిల్‌ మొదటి రెండు వారాల పాటు వేడి ఇలాగే ఉండడంతో యాపిల్‌ ఫార్మింగ్‌లోని పూలు దెబ్బతిన్నాయి.ఎండలు విపరీతంగా ఉండడంతో 50 శాతం యాపిల్‌ పూలు వాడిపోయాయని రైతులు చెబుతున్నారు.

సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాకు చెందిన 70 ఏళ్ల రైతు గులాం రసూల్ మీర్ ఈసారి బంపర్ ఉత్పత్తిని ఆశించామ‌న్నారు.అయితే వేడికి యాపిల్ చెట్ల పూలు రాలిపోవ‌డం ప్రారంభించాయాన్నారు.
ఒక చెట్టుతో మొదలై, ఆ తర్వాత క్రమంగా చెట్లన్నింటి పూలు వాడిపోయి రాలిపోయాయ‌న్నారు.పంట దెబ్బతినడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మీర్ మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల రెండు వారాల్లోనే పూలు వాడిపోయాయని, 50 శాతం పొడి వాతావరణం కారణంగా తోట‌లు దెబ్బతిన్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 Climate Change In Kashmir Apple Farmers Reeling Under Extreme Weather, Falling Yield,Apple, Apple Farming,Apple Farmers, Kashmir,Kashmir Apple,Weather-దారుణంగా త‌గ్గిన యాపిల్ దిగుబ‌డి.. కార‌ణ‌మిదే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొంగాబే-ఇండియా అంచ‌నా ప్రకారం మంచి పంటను దృష్టిలో ఉంచుకుని, ఈసారి భారీ ఆదాయాలు వస్తాయని ఆశ ప‌డ్డామ‌ని మీర్ చెప్పాడు.రూ.7 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేయ‌గా ఇప్పుడు రూ.4 లక్షలకు మించి ఆదాయం రాలేద‌ని మీర్ తెలిపాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube