పరుచుకునే బెడ్‌షీట్లు ఎక్కువకాలం ఉతకకుండా వాడితే ఈ వ్యాధులు గ్యారంటీ!

పరిశుభ్రత( Cleanliness ) అనేది మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది.ఎందుకంటే అనేక వ్యాధులకు మూలం చెడు బాక్టీరియా అని అందరికీ తెలిసినదే.

అది మురికి ద్వారా చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది.ఈ క్రమంలో మిమ్మల్ని మీరు అలాగే ఇంటిని కూడా శుభ్రపరచుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.

ముఖ్యంగా మనం రోజూ పడుకొనే బెడ్ మీద పరుచుకునే బెడ్‌షీట్‌( Bedsheet ).ఎందుకంటే ఒక వ్యక్తి తనను తాను రిలాక్స్‌గా భావించేందుకు బెడ్‌రూమ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతారు.

ఈ విధంగా, బెడ్‌షీట్, దిండు కవర్, దిండు లేదా దుప్పటిలో మురికి ఉంటే చాలా ప్రమాదాలు సంభవిస్తాయి.

Advertisement

అవును, పరిశుభ్రతను క్రమం తప్పకుండా నిర్వహించలేకపోవడం వల్ల మీ మంచంలో బ్యాక్టీరియా( Bacteria ) లేదా ఇతర రకాల సూక్ష్మజీవులు పేరుకుపోతాయి.అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం అనేది మన దైనందిత జీవితంలో ఒక భాగం అయిపోవాలి.ఏదో పని చేశామా.

ఇంటికొచ్చామా.బెడ్ మీద దొర్లామా అని కాకుండా.

శుభ్రతపైన ఫోకస్ చేయాలి.బెడ్‌షీట్‌ను సమయానికి మార్చకపోతే లేదా కడగకపోతే, అది ఆరోగ్యానికి కీడు చేస్తుంది.

మీరు బెడ్‌షీట్‌ను సకాలంలో మార్చకపోతే, మీ చర్మంలోని మృతకణాలు( Deadskin Cells ), చెమట మరియు నూనె వంటివి దానిపై సేకరిస్తాయి.దీని వల్ల మీ తలలోని వెంట్రుకల కుదుళ్లు మూసుకుపోతాయి.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

బట్టలలో మురికితో పాటు తేమ కొన్నిసార్లు రింగ్‌వార్మ్‌కు కారణమవుతుంది.ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్.దీనికి ప్రధాన కారణం తక్కువ తేమ ఉన్న ప్రాంతాల్లో పెరిగే ఫంగస్( Fungus ) అని మీరు చదువుకొనే వుంటారు.

Advertisement

దీన్ని నివారించడానికి, మీరు వెంటనే మీ బెడ్‌షీట్‌ను శుభ్రం చేయాలి.ఇంకా ఇలా మురికి బట్టలు వాడడం వలన కళ్లలో నీరు కారడం, దురద మరియు చర్మంపై ఎర్రటి దద్దుర్లు వంటివి రావడం మొదలు పెడతాయి.

మన చర్మం ప్రతిరోజూ ఈ బ్యాక్టీరియాతో సావాసం చేసినపుడు మీ చర్మం యొక్క పరిస్థితి మరింత దిగజారవచ్చు.ఇంకా అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కాబట్టి కనీసం రెండు మూడు రోజులకు ఒక్కసారైనా బెడ్ షీట్ మార్చుకోవడం ఉత్తమం.

తాజా వార్తలు