వైసీపీలో జగన్ తర్వాత ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్నే వైసీపీ నేతల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.నిన్న మొన్నటి వరకు అందరూ షర్మిల, లేదా విజయమ్మ పార్టీ బాధ్యతలు చూస్తారని అందరూ అనుకున్నారు.
అయితే ఇప్పుడు షర్మిల పొరుగు రాష్ట్రంలో వేరు కుంపటి పెట్టుకున్న దరిమిలా ఏపీలో రేపు ఏదైనా జరిగి జగన్ మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్తితి ఎదురైతే ఎవరు వైసీపీ బాధ్యతలు తీసుకుంటారు.గతంలో అయితే.
జగన్ జైలుకు వెళ్లిన దరిమిలా పార్టీ బాధ్యతలను షర్మిల, విజయమ్మ భుజాన వేసుకున్నారు.షర్మిల పాదయాత్ర చేపట్టి ప్రజల్లో ఉన్నారు.

విజయమ్మ పార్టీ కార్యాలయానికే పరిమితై జిల్లాల రాజకీయాలను చక్కబెట్టారు.ఇలా దాదాపు 20 నెలలపాటు ఇద్దరూ కలసి పార్టీని నడిపించారు.ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో షర్మిల ఏపీలోకి అడుగు పెట్టే పరిస్థితి లేదు.ఇక, విజయమ్మ కూడా వైసీపీ గౌరవ అధ్యక్షరాలి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.
ఎందుకంటే తెలంగాణలో తల్లిని కూడా ప్రచారానికి తీసుకువెళ్లాలని షర్మిల భావిస్తున్నట్టు సమాచారం.ఇదే జరిగితే వైసీపీలో గౌవర అధ్యక్షురాలు పదవి పూర్తిగా తొలగిపోతుంది.
ఇక, ఇప్పుడున్న పరిస్థితిలో వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ ఎదగాలని భావిస్తున్న నేపథ్యంలో జగన్‌ను ఇలానే ఉంచితే బీజేపీ ఎదిగే పరిస్తితి లేదని రాష్ట్ర కమల నాథులు కేంద్రంలోని పెద్దలకు సమాచారం చేరవేశారు.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల లోపే.
జగన్‌పై సాగుతున్న అక్రమాస్తుల కేసులు విచారణను కొలిక్కితెస్తే ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.ఈ క్రమంలో జగన్ లేకపోతే పార్టీని ఎవరు నడిపిస్తారు? ఎవరు పార్టీబాధ్యతలను భుజాన వేసుకుంటారనే అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం షర్మిల వంటి బలమైన నాయకురాలు జగన్‌కు లేరనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో ఆయన సతీమణి భారతి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారని కొందరు వైసీపీ కీలక నేతలు చెబుతున్నారు.ఇటీవల సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా భారతి పేరును పరోక్షంగా ప్రస్తావించారు.కడపలోగత ఎన్నికల సమయంలో భారతి ప్రచారం చేశారు అని సజ్జల పరోక్షంగా వ్యాఖ్యానించినా దీని వెనుక అంతరార్థం మాత్రం జగన్ తదుపతి పగ్గాలు భారతికేనని ఓ నిర్ణయానికి వచ్చారనేది స్పష్టంగా తెలుస్తోంది.
ఇక, పార్టీలో కీలక నేతలుగా ఉన్న పెద్దిరెడ్డి, సజ్జల.వంటివారు ఎలానూ ఉంటారు కనుక భారతి జగన్ తర్వాత పగ్గాలు చేపట్టినా పార్టీకి ఇబ్బంది ఉండదనే సంకేతాలు వస్తున్నాయి.