నియోజకవర్గాల పై క్లారిటీ ! అభ్యర్థుల ఎంపికపై పవన్ కసరత్తు ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వచ్చే ఎన్నికలఫై పూర్తిగా దృష్టి సారించారు. టిడిపి ( tdp )తో పొత్తులో భాగంగా అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలపై పవన్ క్లారిటీకి వచ్చారు.

 Clarity On Constituencies! Pawan Exercise On The Selection Of Candidates, Pavan-TeluguStop.com

ఇప్పటికే ఈ విషయంపై టిడిపి అధినేత చంద్రబాబుతోను చర్చించారు.పొత్తులో భాగంగా జనసేనకు 28 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలను ఇచ్చేందుకు అంగీకారం జరిగింది అనే ప్రచారం జరుగుతుంది.

అంతేకాదు ఏ ఏ  నియోజకవర్గాలను జనసేనకు కేటాయించబోతున్నారనే  విషయంలోనూ పవన్ చంద్రబాబు చర్చించుకుని ఒక క్లారిటీకి వచ్చారు.దీనిలో భాగంగా జనసేనకు( Janasena ) పొత్తులో భాగంగా ఇచ్చే స్థానాల్లో ఎవరిని అభ్యర్థులుగా నియమించాలనే విషయంపై పవన్ దృష్టి సారించారు.

Telugu Ap, Chandrababu, Janasena, Lokesh, Pavan Kalyan, Pawan Kalyan, Telugu Des

ఈ మేరకు పార్టీకి చెందిన కీలక నేతలతో పవన్ భేటీ అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల  ద్వారా తెలుస్తోంది.ఈ మేరకు జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ? ఆ నియోజకవర్గాల్లో ఏ పార్టీ బలంగా ఉంది.జనసేన తరఫున ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దింపితే విజయం ఖాయం అనే విషయాల పైన పవన్ చర్చిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులను పిలిపించి మాట్లాడి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారట.

ముఖ్యంగా ఉభయగోదావరి, కృష్ణ, విశాఖ, గుంటూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల నేతలతో  పవన్ సమావేశమైనట్లు తెలుస్తోంది.

Telugu Ap, Chandrababu, Janasena, Lokesh, Pavan Kalyan, Pawan Kalyan, Telugu Des

ఈ జిల్లాలో ఏ ఏ నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉంది ?అక్కడ టిడిపి, వైసిపిల( TDP , YCP ) పరిస్థితి ఏమిటి ? జనసేనకు టికెట్ ఇస్తే టిడిపి ఎంతవరకు సహకరిస్తుంది ఇలా  అనేక అంశాల పైన వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలతో చర్చించినట్లు సమాచారం.ఇక సీఎం సీటు విషయంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు,  తమ పార్టీకి శ్రేయోభిలాషి అయిన చేగొండి హరి రామ జోగయ్య ముఖ్యమంత్రి పదవి విషయంలో తనను ప్రశ్నిస్తూ లేఖ విడుదల చేయడం పైన కొంతమంది పార్టీ కీలక నాయకులతో పవన్ చర్చించినట్లు సమాచారం.మొత్తంగా అతి త్వరలోనే జనసేన తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక విషయంలో క్లారిటీకి రావాలని, ముందుగానే వారి పేర్లను ప్రకటించి వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోయే అన్ని నియోజకవర్గాల్లోనూ విజయానికి డోకా లేకుండా చేసుకునే పనిలో పవన్ బిజీగా ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube