సిటీ ఆర్ముడ్ రిజర్వ్ గ్రౌండ్ నందు పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.
ఎస్.గారు.దేశ రక్షణ, అంతర్గత పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజా శాంతి భద్రతల పరిరక్షణ కోసం అరాచక శక్తుల అణచివేసే క్రమంలో విధి నిర్వహణలో అశువులు బాసిన అమర పోలీసు వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి త్యాగనిరతికి చిహ్నంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విధి నిర్వహణలో పోలీసు వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ సమాజ సేవలో ధైర్యసాహసాలు ప్రదర్శించి వారి ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమర వీరుల అత్యున్నత త్యాగనిరతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన “పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం” జరుపుకోవడం జరుగుతోంది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌ|| డి.జి.పి.శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, ఐ.పి.ఎస్.గారి ఆదేశాల మేరకు ది.21.10.2022వ తేదీ నుండి ది.31,10,2022వ తేదీ వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను వివిధ అంశాలపై రూపొందించిన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాలలో భాగంగా ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలోని సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ గ్రౌండ్లో ది.28.10.2022వ తేదీ మరియు 29.10.2022వ తేదీ వరకు రెండు రోజులు పాటు ఓపెన్ హౌన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమాన్ని ది.28.10.2022వ తేదీన ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., గారు ముఖ్యఅతిదిగా విచ్చేసి పావురాలను, బెలూన్లను ఎగరవేసి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభిండచం జరిగింది.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ….
అక్టోబర్ 21వ తేదీకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమర వీరులను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ రోజు రాష్ట్ర పోలీస్ శాఖ తరుపున, సిటీ పోలీశాఖ తరుపున ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఆర్ముడ్ రిజర్వ్ గ్రౌండ్ నందు నిర్వహించడం జరిగిందని, ఈ ఓపెన్ హౌస్ యొక్క ముఖ్యఉద్దేశ్యం ఏమిటంటే పోలీస్ శాఖలో అధునిక పద్ధతిలో ఉపయోగిస్తున్న ఆయుధాలు, సైబర్ క్రైమ్ నేరాలను ఏవిధంగా చేదిస్తున్నాము.తీవ్రవాదులు, మావోయిస్ట్లను ఎదుర్కొనుటలొ ఏవిధమైన సాధనాలు, అయుధాలను పోలీసు వారు ఉపయోగించి ముందుకు వెళ్ళుతున్నాము అనేది సమాజంలోని ప్రజలకు, యువతకు, విద్యార్థులకు తెలియజేసి అవగాహన కలిగించేందుకు, ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం రెండు రోజులు నిర్వహించడం జరుగుతుందని కావునా అందురు వీక్షించవచ్చు అన్నారు.
సిటీ ఆర్మ్ రిజర్వ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన ఓపెన్ హౌస్లో బి.డి.(బాంబ్ నిర్వీర్యం) బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్లు, బాడీ వాన్ కెమెరాలు, వివిధ రకాల ఆయుధాల పనితీరు, ఎన్.డి.ఆర్.ఎఫ్.,, ఏ.పి.ఎస్.డి.ఆర్.ఎఫ్., సిటీ సెక్యూరిటీ వింగ్, కమ్యునికేషన్, సైబర్ క్రైమ్, క్రైమ్ స్పాట్, ఆక్టోపస్, ట్రాఫిక్ గురించి మరియు వాటర్ కెనాన్, వజ్ర, ఫలకాన్ తదితర వాహనాల పాత్ర మరియు పని తీరు గురించి పాఠశాల మరియు కళాశాలల విద్యార్ధులకు సిబ్బందితో సమగ్రంగా వివరించి, అవగాహన కలిగించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాగ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి విద్యార్థులను అలరించింది.
ఈ కార్యక్రమానికి ఈస్ట్ డి.సి.పి.శ్రీ విశాల్ గున్ని ఐ.పి.ఎస్.గారు, వెస్ట్ ఇన్ ఛార్జ్ డి.సి.పి.శ్రీ శ్రీనివాసరావు గారు, సి.ఎస్.డబ్ల్యూ.డి.సి.పి.కుమారి ఉదయరాణి గారు, ఇన్ ఛార్జ్ అడ్మిన్ డి.సి.పి.శ్రీమతి పి.వెంకట రత్నం గారు, ట్రాఫిక్ ఏ.డి.సి.పి.శ్రీ సర్కార్, స్పెషల్ బ్రాంచ్ ఏ.డి.సి.పి.శ్రీ లక్ష్మీపతి, ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐ.లు, ఆర్.ఎస్.ఐలు, సిబ్బంది మరియు వివిధ పాఠశాలల మరియు కళాశాలలకు చెందిన విద్యార్ధులు పాల్గొన్నారు.