బెదిరింపులు అనేవి చాలా వరకు అందరూ ఎదుర్కొనే ఉంటారు.అది ఏ విషయంలోనైనా సరే.
బెదిరింపు అనేది ఒక భయం లాంటిది.ఎందుకంటే బెదిరింపులతో ఏదైనా లొంగ తీసుకుంటారు దుండగులు.
అలా బెదిరింపులు సామాన్యులకే కాకుండా పెద్ద పెద్ద రంగాలకు చెందిన వాళ్లకు కూడా ఎదురవుతూ ఉంటాయి.
ముఖ్యంగా రాజకీయ నాయకులకు, సినీ సెలబ్రెటీలకు బెదిరింపులు అనేవి బాగా ఎదురవుతూ ఉంటాయి.
ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు బెదిరింపులు ఎదుర్కొన్నారు.కొందరు ఆ బెదిరింపులకు లొంగిపోగా.
మరికొందరు ఆ బెదిరింపులను ఎదుర్కొన్నారు.చాలావరకు చాలామంది నటీనటులు తమ గతంలో ఎదుర్కొన్న బెదిరింపుల గురించి మీడియా ముందు బయట పెడుతుంటారు.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా.ఒక సినిమాటోగ్రాఫర్ కి కూడా బెదిరింపులు ఎదురయ్యాయి.ఇంతకు ఆ సినిమాటోగ్రాఫర్ ని బెదిరించింది ఎవరంటే ఒక డైరెక్టర్.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
ఎంఎస్ ప్రభు అనే ఓ సీనియర్ సినిమాటోగ్రాఫర్ గత 30 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నాడు.

అయితే ఇతడికి 2016లో సూర్య అనే డైరెక్టర్ పరిచయమయ్యాడు.దీంతో అతడు హీరోయిన్ పద్మప్రియ తో భారతీయ వీడియో సాంగ్ చేయాలి అని ప్రభును అడగగా.ఆయన ఆ వీడియో తయారు చేసి ఇచ్చాడు.
ఆ తర్వాత డైరెక్టర్ సూర్య పద్మప్రియ ఫోన్ నెంబర్ కావాలి అని ప్రభువును బాగా ఒత్తిడి చేశాడట.అయితే ప్రభువు ఆమె నెంబర్ ఎందుకు అని అడగటంతో డైరెక్టర్ సమాధానం ఇవ్వకుండా నీ భార్యను అత్యాచారం చేస్తాను అని బెదిరించడం మొదలు పెట్టాడట.
దీంతో ప్రభు భయపడి వెంటనే ఏం చేయాలో తోచక రామాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని తెలిసింది.ఇక అక్కడ సూర్య అనే వ్యక్తి.నటి పద్మప్రియ ను పరిచయం చేయాల్సిందిగా.ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా నన్ను బెదిరిస్తున్నాడు అని.నెంబర్ ఇవ్వకపోతే నా భార్యను అత్యాచారం చేస్తానని బెదిరిస్తున్నాడని.దయచేసి అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని ఫిర్యాదు చేశాడు ప్రభు.

ఇక ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తుంది.ఇక హీరోయిన్ పద్మప్రియ విషయానికి వస్తే ఈమె.తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి.తెలుగులో ఆది పినిశెట్టితో కలిసి మృగం సినిమాలో నటించింది.అంతేకాకుండా శర్వానంద్ తో కలిసి అందరి బంధువయ్య సినిమాలో నటించింది.ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారింది.
ఇలా చాలామంది దర్శక నిర్మాతలు హీరోయిన్లను లోబర్చుకోవటానికి మధ్యవర్తులను బెదిరిస్తూ ఉంటారు.కొన్ని సందర్భాలలో మధ్యవర్తులు ఆ బెదిరింపులకు లొంగిపోతూ ఉంటారు.
మరికొందరు ధైర్యంగా పోలీసులకు చెబుతూ ఉంటారు.ఇప్పటికే ఇలాంటివి చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి.
పోలీస్ కేసు వేసినా కూడా ఇటువంటి బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి.ఇక హీరోయిన్లకు కూడా నేరుగా ఇటువంటి బెదిరింపులు కూడా ఎదురయ్యాయి.







