నకిలీ పాస్ పోర్ట్( Fake passport ) కుంభకోణం కేసులో సీఐడీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిజామాబాద్( Nizamabad ) లో కానిస్టేబుల్ పాస్ పోర్ట్ వెరిఫికేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.డబ్బులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా పాస్ పోర్ట్ వెరిఫికేషన్( Passport Verification ) కు అఫ్రూవల్ ఇవ్వడంతో నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సైని లక్ష్మణ్ ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం లక్ష్మణ్ మాక్లుర్, నవిపేట్ ఎస్బీ ఇంఛార్జ్ గా ఉన్నారు.కాగా ఈ కుంభకోణంలో ఇప్పటివరకు మొత్తం 14 మందిని అధికారులు అరెస్ట్ చేశారు.మరోవైపు 12 మంది నిందితుల కస్టడీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.