హైదరాబాద్ పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిఐ భూమిని ఇప్పిస్తానంటూ ఒక ఎన్నారై ని మోసం చేశాడు.దాదాపు 50 లక్షల వరకు తీసుకున్నట్లు బాధితుడు ఫిర్యాదు చేస్తున్నాడు.
రంగంలోకి దిగిన పోలీసులు ఆ సదరు సిఐని అరెస్టు కూడా చేశారు.అసలు ఏం జరిగిందంటే రంగారెడ్డి జిల్లా పరిధిలోని కందుకూరు దగ్గరలోని ఒక భూమి వ్యవహారంలో సిఐ అరెస్టు అయ్యాడు.
ప్రాథమిక వివరాల ప్రకారం నగరానికి చెందిన ఎన్నారై కి భూమిని ఇప్పిస్తానంటూ దాదాపు 54 లక్షల సిఐ సుధాకర్ తీసుకున్నట్లు సమాచారం.అందుకుగాను రాజేష్ అనే వ్యక్తిని కూడా పరిచయం చేసినట్లు తెలుస్తోంది.
రాజేష్ ను ఎమ్మార్వో గా నమ్మించినట్లు సమాచారం అందింది.నకిలీ ఐడీ కార్డులు సృష్టించి ఎన్నారై కి కూడా పరిచయం చేసినట్లు విచారణలో తెలిసింది.త్వరలోనే ప్రమోషన్స్ ద్వారా ఆర్డిఓ అవుతాడనీ ఎన్నారై ను సీఐ సుధాకర్ నమ్మించాడు.అయితే నెలలో గడుస్తున్నా భూమి ఇప్పించకపోవడంతో ఎన్నారై మోసపోయానని గుర్తించాడు.
తనని మోసం చేసిన ఇద్దరి వ్యక్తులపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కొద్దిరోజుల క్రిందట ఫిర్యాదు చేశాడు.
పోలీసులు విచారణలో ఎన్నారై ని మోసం చేసినట్లు రుజువడంతో సిఐని అరెస్టు చేశారు.అయితే ఈ కేసులో ఏ వన్ గా రాజేష్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది.అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సుధాకర్ మోసం వెలుగులోకి రావడంతో ఉన్నత అధికారులు చర్యలు చేపట్టారు.సిఐ సుధాకర్ పై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ మేరకు హైదరాబాద్ నగర సిపి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.అంతేకాకుండా రాజేంద్రనగర్లో నేషనల్ పోలీస్ అకాడమీలో దొంగతనం జరిగింది.
కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపిఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అకాడమీలో కంప్యూటర్లు దొంగతనం జరగడం సంచలనం చెపుతుంది.భద్రతా బలగాల కన్నుగప్పి 7 కంప్యూటర్లను మాయం చేశారు.కంప్యూటర్లు చోరీకి గురవడంతో అధికారులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.సి సి ఫుటేజ్ లో దొంగతనం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.అకాడమీలో ఐటీ సెక్షన్ లో పనిచేస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి కంప్యూటర్లు చోరీ చేసినట్లు పోలీస్ అధికారులు గుర్తించారు.