Chiyaan Vikram : ప్రాణం పోతుందని చెప్పిన వినకుండా ఆ రిస్క్ చేసిన స్టార్ హీరో…

సినిమా హీరోలు అంటే హీరోయిన్ తో నటించే సీన్లలో గాని, రొమాంటిక్ సీన్లలో గాని సాంగ్స్ లో గానీ ఎక్కువగా నటిస్తూ మిగితా వాటిలో ఎక్కువగా డూప్ లను వాడుతూ ఉంటారు.ఇక ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో అయితే కేవలం డూప్ లతోనే మేనేజ్ చేసే హీరోలను మనం చూశాం.

 Chiyaan Vikram Body Transformation For I Movie-TeluguStop.com

కానీ ఒక క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేసే నటులు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు.అందులో తమిళ్ ఇండస్ట్రీకి చెందిన చియాన్ విక్రమ్( Chiyaan Vikram ) ఒకడు.

ఐ సినిమా( I Movie )లో ఆయన నటించిన నటనకు గాను ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువనే చెప్పాలి.దానికి మించి ఆయన ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ల లో నటించడం కోసం ఆయన చూపించిన డెడికేషన్ ని ఇప్పటివరకు ఏ హీరో చేసి ఉండడు.

 Chiyaan Vikram Body Transformation For I Movie-Chiyaan Vikram : ప్రాణ-TeluguStop.com

ఈ సినిమాలో ముందుగా బాడీ బిల్డర్ కోసం వచ్చే సీన్ లో బాడీ ని చాలా స్ట్రాంగ్ గా చూపించాలి.

Telugu Chiyaan Vikram, Shankar, Exercise-Movie

దానికోసం ఆయన బాడీ ఫిట్ చేయమని శంకర్( Director Shankar ) చెబితే విక్రమ్ ఒకే అని ఎలాంటి స్టెరైట్స్ గాని, టాబ్లెట్స్ గాని వాడకుండా కేవలం మూడు నెలల్లోనే 20 కేజీలు పెరిగి బాడీని ఫిట్ గా చేసుకున్నాడు.ఇక దాని తర్వాత ఐ వైరస్ సోకిన తర్వాత బాడీ చాలా వీక్ అయిపోతుంది.ఆ క్యారెక్టర్ లో చాలా వీక్ గా కనిపించాలి కాబట్టి దానికోసం గ్రాఫిక్స్ ను వాడదామని శంకర్ చెప్పిన కూడా వినకుండా కేవలం రెండు నెలల్లో 15 కేజీల వెయిట్ తగ్గడానికి ప్రయత్నం చేశాడు.

ఇక ఈ ప్రయత్నంలోనే డాక్టర్లు చాలావరకు ఆయన్ని హెచ్చరించారట.

Telugu Chiyaan Vikram, Shankar, Exercise-Movie

ఒకేసారి అంత వెయిట్ తగ్గడం( Weight Loss ) వల్ల మీ బాడీకి ఏదైనా ఇబ్బంది జరగొచ్చు అని చెప్పిన కూడా తన ప్రాణాలకు తెగించి మరి ఆ క్యారెక్టర్ కోసం రోజు కేవలం నిమ్మకాయ రసం తాగుతూ, ఒక బాయిల్డ్ ఎగ్ తింటూ రెండు నెలల పాటు గడిపాడట.దాంతో ఆయన బాడీ చాలా వీక్ గా అయిపోయింది.ఎంతలా అంటే పెద్ద శబ్దం వచ్చిన కింద పడిపోయేంత, ఒక్క పది నిమిషాలు కరెక్ట్ గా నిల్చుంటే బాడీ మొత్తం శివర్ అయిపోయెంత వీక్ గా అయ్యాడట.

దాంతో వాళ్ల ఫ్యామిలీ కూడా ఆయన్ని చూడటానికి భయపడేలా తయారయ్యడట.ఇక అలాంటి బాడితో ఆ సినిమాలో నటించాడు.అంత డెడికేషన్ చూపించినా కూడా ఆ సినిమా పెద్ద సక్సెస్ అయితే సాధించలేదు.విక్రమ్ లాంటి డెడికేషన్ మరే హీరోకి ఉండదని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube