'ఆచార్య' ట్రైలర్‌ టాక్‌ లోని మరో కోణం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలక పాత్ర లో నటించిన ఆచార్య సినిమా ఈనెల 28వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు.

 Chirnajeevi Acharya Movie Trailer Talk Details, Acharya, Acharya Trailer, Chiran-TeluguStop.com

వరుస విజయాలతో దూసుకు పోతున్న కొరటాల శివ ఈ సినిమా తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం మెగా అభిమానులు చాలా నమ్మకం తో ఎదురు చూస్తున్నారు.మొదట ఈ సినిమా ను చిరంజీవి ప్రధాన పాత్రలో చేయాలని భావించారు.

కానీ కథను స్వల్పంగా మార్చి రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించి చేశారు అనే టాక్‌ వినిపిస్తుంది.చిరంజీవి మరియు చరణ్ కలిసి నటించడం వల్ల ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని.

తద్వారా భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటూ చిత్ర యూనిట్ సభ్యులు భావించారు.అంతే కాకుండా మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తండ్రి కొడుకు ల మల్టీ స్టారర్ సినిమా కూడా ఇచ్చినట్లు అవుతుందని.

అది తన వల్ల సాధ్యమవుతుంది అంటూ కొరటాల శివ ఈ సినిమాను చేసినట్లుగా తెలుస్తుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో రామ్ చరణ్ పాత్ర మెల్ల మెల్లగా పెంచి చిరంజీవి స్థాయి పాత్ర గా మార్చినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ సమయం లో కరోనా రావడం వల్ల ఆలస్యం అయిన విషయం తెలిసిందే.

Telugu Acharya, Acharya Trailer, Chiranjeevi, Koratala Shiva, Multi Starrer, Ram

తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మెగా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటే మరి కొందరు మెగా అభిమానులు మాత్రం కాస్త నిరుత్సాహంగా ఉందంటున్నారు.ఈ సినిమా చిరంజీవి సినిమా అనుకోవాలా లేదంటే రామ్ చరణ్ సినిమా అర్థం కావడం లేదు అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.మెగాస్టార్ సినిమా గా ట్రైలర్ చూస్తే ఎక్కువగా రామ్ చరణ్ కనిపించాడు అంటూ స్వయంగా కొందరు మెగా అభిమానులు భావిస్తున్నారు.

సినిమా లో కూడా రామ్చరణ్ పాత్రను బలవంతంగా జొప్పించే ప్రయత్నం చేస్తే కచ్చితంగా సినిమా కు నెగిటివ్ టాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆచార్య సినిమా ఫలితం పై ట్రైలర్ విడుదల తర్వాత ఆందోళన నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube