మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ కుర్ర హీరోలు కూడా చేయలేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.ఈయన ఇది వరకు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసేవాడు.
కానీ ఇప్పుడు అలా కాదు ఒకటి పూర్తి అవ్వకుండానే మరొకటి చేస్తూ ఫుల్ స్పీడ్ గా ఉన్నాడు.ప్రెసెంట్ చిరంజీవి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచాడు.
ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.ఇందులో రామ్ చరణ్ కూడా సిద్ధ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించాడు.
చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రొమోషన్స్ స్పీడ్ గా చేయాలనీ మేకర్స్ నిర్ణయించారు.
దీంతో వరుసగా ఈ సినిమా నుండి అప్డేట్ లు ఉండేలా చూసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఈ ట్రైలర్ చూసిన మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.సినిమాలో యాక్షన్ ఏ లెవల్ లో ఉంటుందో మచ్చుకకు కొన్ని సీన్స్ చూపించాడు కొరటాల.రామ్ చరణ్ తండ్రి చిరంజీవి తో కలిసి పూర్తి స్థాయిలో నటించిన సినిమా ఇది.2 నిముషాల 32 సెకెన్స్ ఉన్న ఈ ట్రైలర్ లో అన్ని ఎలిమెంట్స్ చూపించాడు కొరటాల.

”దివ్యవనం ఒకవైపు.తీర్ధజనం ఒకవైపు.నడుమ పాదఘట్టం.” అంటూ స్టార్ట్ అయినా ఈ ట్రైలర్ లో ఇలాంటి డైలాగ్స్ చాలానే ఉన్నాయి.ఇవన్నీ కూడా అప్పుడే మెగా ఫ్యాన్స్ మైండ్ లో నోట్ చేసుకున్నారు కూడా.సగం ట్రైలర్ లో రామ్ చరణ్ కనిపించాక ఆ తర్వాత చిరు ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత అదరహో అనేలా యాక్షన్ సన్నివేశాలు చూపించారు.ఇక సోను సూద్ ను కు వార్ణింగ్ ఇచ్చే సీన్ మాత్రం అదుర్స్ అనిపిస్తుంది.
మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ తో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచడంలో సఫలం అయ్యారు.







