చిరంజీవి మోహన్ రాజా కాంబినేషన్ లో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.చిరంజీవి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నయనతార ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుండగా అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు.బుల్లితెరపై గ్లామరస్ గా కనిపించే అనసూయ వెండితెరపై మాత్రం గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రల్లోనే ఎక్కువగా నటించారు.
ఖిలాడీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా అనసూయ పాత్రకు మాత్రం మంచిపేరు వచ్చింది.ఖిలాడీ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉందనే సంగతి తెలిసిందే.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి యాంకర్ అనసూయకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.అయితే ఈ వార్నింగ్ సినిమాలో అని నిజ జీవితంలో కాదని సమాచారం అందుతోంది.గాడ్ ఫాదర్ లో అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

గాడ్ ఫాదర్ అనసూయ కెరీర్ లో మరో మంచి సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ కొన్నిసార్లు నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటుంటే కొన్నిసార్లు నెటిజన్ల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు.అయితే కెరీర్ పరంగా అనసూయ బుల్లితెరపై, వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉండటం గమనార్హం.

అనసూయ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.మరోవైపు జబర్దస్త్ షోకు అనసూయ యాంకర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ఇతర షోలు కూడా అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టినా జబర్దస్త్ షో స్థాయిలో మాత్రం మంచి పేరును తెచ్చిపెట్టలేదు.పుష్ప ది రూల్ లో అనసూయ పాత్ర పరిధి పెరిగిందని ఈ సినిమాతో అనసూయ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరుతుందని అభిమానులు సైతం కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.







