స్టార్ డైరెక్టర్ రాజమౌళి వేర్వేరు కారణాల వల్ల యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో కలిసి పని చేయడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.రాజమౌళి చరణ్ కాంబినేషన్ లో మగధీర సినిమా తెరకెక్కగా ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది.
అయితే తాజాగా రామ్ చరణ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ చెప్పిన విషయాలను నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఒకింత షాకిస్తున్నాయి.
రాజమౌళి మెగాస్టార్ చిరంజీవికి మగధీర కథ చెబుతున్న సమయంలో తాను కూడా అదే గదిలో ఉన్నానని చరణ్ పేర్కొన్నారు.
జక్కన్న కథ చెప్పే సమయంలో చిరంజీవి తనను తాను మరిచిపోయి ఆ కథను వింటూ ఉండిపోయారని రామ్ చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇంటర్వెల్ కు సంబంధించిన సీన్లను చెబుతున్న సమయంలో ఆ కథలో నాన్న లీనమైపోయి హెలికాఫ్టర్ నుంచి ఎలా దూకాలని అడిగారని చరణ్ కామెంట్లు చేశారు.
చిరంజీవి అలా చెప్పిన వెంటనే ఆ విషయాన్ని గమనించిన రాజమౌళి ఈ కథ రామ్ చరణ్ కోసం తయారు చేసిన స్క్రిప్ట్ అని చెప్పారని చరణ్ చెప్పుకొచ్చారు.

మగధీర కథ చిరంజీవికి ఎంతగా నచ్చేసిందో చరణ్ చెప్పకనే చెప్పేశారు.ఈ సినిమాలో మెయిన్ హీరోగా నటించే అవకాశం వచ్చి ఉంటే చిరంజీవి అస్సలు వదులునేవారు అయితే కాదని చరణ్ క్లారిటీ ఇచ్చేశారు.

రాజమౌళి చిరంజీవి ఫుల్ లెంగ్త్ రోల్ లో ఒక సినిమాను తెరకెక్కించాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాల్సి ఉంది.మగధీర మూవీలో చిరంజీవి నటించినా సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.అయితే కథకు అనుగుణంగా ఆ సినిమాలో చిన్నచిన్న మార్పులు చేయాల్సి ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.